రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కార్మికులు ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీలో రూ. 24 వేల వేతనం నిర్ణయించాలని కోరారు. కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు, విలీన గ్రామాల్లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 14 ప్రకారం సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐలను అమలు చేయాలన్నారు. వారాంతపు సెలవులు, భద్రతా పరికరాలు, వస్తు సామగ్రి అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ముందు మున్సిపల్ కార్మికుల ఆందోళన - కలెక్టర్ కార్యాలయం
కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు.

రాజన్న సిరిసిల్ల