తెలంగాణ

telangana

ETV Bharat / state

'పారిశుద్ధ్యంపై సమరం.. ప్రతి ఒక్కరి బాధ్యత'

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పారిశుద్ధ్య పనులను కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రారంభించారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు.. ప్రతి ఒక్కరు పారిశుద్ధ్యంపై సమరం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని పలు గ్రామాల్లో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణతో కలిసి పనులను పరిశీలించారు.

Collector Krishnabhaskar has started sanitation work in the Rajanna Sirisilla district.
'పారిశుద్ధ్యంపై సమరం.. ప్రతి ఒక్కరి బాధ్యత'

By

Published : Jun 1, 2020, 5:57 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పారిశుద్ధ్యంపై చేపట్టిన వారం రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లాలోని పలు గ్రామాల్లో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణతో కలిసి పారిశుద్ధ్య పనులను తనిఖీ నిర్వహించారు.

నర్సరీల పరిశీలన

కోనరావుపేట పేట మండలం చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో సిబ్బంది చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. గ్రామాల్లో హరితహారం కోసం పెంచుతున్న నర్సరీలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట పలువురు జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రంగనాయక, మల్లన్న సాగర్​ల భూసేకరణపై హరీశ్ సమీక్ష

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details