రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 57 రైతు వేదికలను సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లతో ఏదైనా సమస్య ఉంటే స్థానిక సర్పంచ్ల ద్వారా పనులు చేపట్టాలని సూచించారు. కూలీలకు సంబంధించి సమస్యలుంటే స్థానిక కూలీలను ఉపయోగించి పనులు చేపట్టాలని తెలిపారు.
'సెప్టెంబర్ 30 నాటికి రైతు వేదిక భవనాలు పూర్తవ్వాలి' - collector krishna bhaskar review on rythu vedika
సెప్టెంబర్ 30 నాటికి రైతు వేదికలను పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రైతు సమన్వయ సమితి సభ్యులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
రైతు వేదిక భవనాలపై సిరిసిల్ల కలెక్టర్ సమీక్ష
నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా.. స్థానిక మండలస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. ఇసుక సమస్యకు సంబంధించి తహసీల్దార్లకు సూచనలు ఇవ్వడం, విద్యుత్ సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రతిరోజు ఏఈలు తమ పరిధిలో నిర్మాణంలో ఉన్న రైతు వేదిక వద్దకు వెళ్లి పనులు జరిగేలా చూడాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ సూచించారు.
- ఇదీ చూడండి :ఆలయ భూమిలో రైతు వేదిక.. పోలీసులకు ఫిర్యాదు