ఏఐసీసీ పిలుపుమేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్.. రైతులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు బిల్లును వ్యతిరేకిస్తూ అన్నదాతల సంతకాలు సేకరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వడ్లకు రూ.2,500 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సూచనల మేరకే రైతన్నలు సన్నబియ్యం పండించారన్నారు. అతివృష్టి, అనావృష్టి కారణాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
రైతుబిల్లులను వ్యతిరేకిస్తూ రైతులతో సంతకాల సేకరణ - సన్నరకం వడ్లకు మద్దతు ధర
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు బిల్లులను వ్యతిరేకిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో రైతులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అతివృష్టి,అనావృష్టి కారణాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని కోరారు.
రైతుబిల్లులను వ్యతిరేకిస్తూ రైతులతో సంతకాల సేకరణ
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: కూలీ రేటు పెంచాలని హమాలీ కార్మికుల ధర్నా..