కాళేశ్వరం ప్యాకేజీ పనుల పరిశీలనకు వచ్చిన సీఎంఓ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్.. మానేరు తీరం అందాలను చూసి మురిసిపోయారు. మానేరు జలాలు.. అందులోని పక్షులను తన చరవాణితో క్లిక్‌మనిపించారు. మల్కపేటలో సమీక్ష ముగించుకుని వెళ్తూ.. హెలికాఫ్టర్ నుంచి మానేరు వాగులో ఎగురుతున్న పక్షుల ఫోటోలు తీసుకున్నారు. వాటిని తన ట్విటర్ ఖాతాలో ఉంచారు.
మానేరు అందాలకు మురిసిన స్మితా సబర్వాల్ - సీఎంఓ ముఖ్యకార్యదర్శి కాళేశ్వరం పర్యటన
మానేరు తీరం అందాలను చూసి సీఎంఓ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్ అబ్బురపడ్డారు. హెలికాఫ్టర్ నుంచి తీరంలో ఎగురుతున్న పక్షుల ఫోటోలు తీసుకున్నారు. తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కాళేశ్వరం లింక్-3లోని తొమ్మిదో ప్యాకేజీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తర్వాత అక్కడి ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. గోదావరి జలాలను ఎగువమానేరులోకి తరలించి ఖరీఫ్ నాటికి జిల్లాలోని మెట్ట రైతులకు సాగు నీరందించేలా పనులు జరగాలని స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ కృష్ణభాస్కర్, ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ సుధాకర్, ఆర్డీవో శ్రీనివాసరావు, ఈఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: మల్కపేటలో స్మితా సబర్వాల్ పర్యటన.. రిజర్వాయర్ పనుల పరిశీలన
TAGGED:
CMO chief secretary news