రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల(sirscilla) పట్టణ పరిధిలోని చంద్రంపేటకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ బుల్లి మగ్గంపై అద్భుతాలు సృష్టిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. నేతల ముఖ చిత్రాలు వేసి ప్రతిభను చాటుకుంటున్నారు. వాటిపైనే చీరలు కూడా నేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr), మంత్రి కేటీఆర్(ktr) చిత్రపటాలను బుల్లి మగ్గంపై నేసి అందరినీ అలరించారు.
చేనేత కళాఖండం... బుల్లిమగ్గంపై కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలు - cm kcr and ktr print on loom
ప్రతి మనిషిలో కచ్చితంగా ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. వాటిలో చేనేత కార్మికులది ప్రత్యేక శైలి. అగ్గిపెట్టెలో పట్టుచీరని పట్టించడమే గాక, వినూత్న ప్రయత్నాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. చిన్న మగ్గంపై చీరలు నేయడమే కాకుండా ప్రముఖుల చిత్రాలను సైతం వేస్తున్నారు సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు. తాజాగా సీఎం కేసీఆర్, కేటీఆర్ చిత్రాలను వేసి శెభాష్ అనిపించారు.
మగ్గంపై కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు
రేపు సీఎం కేసీఆర్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా.. బుల్లి మగ్గంపై నేసిన వారి చిత్రపటాలను కేసీఆర్కు అందజేయనున్నట్లు హరిప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి:MURDER ATTEMPT: భర్త చేతిలో దాడికి గురై కోలుకుంటున్న భార్య, కుమారుడు