మధ్యమానేరు బ్యాక్‌వాటర్ కరకట్ట లీకేజీ వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోడిముంజ గ్రామంలో ముంపు గ్రామాల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న భట్టికి.. రైతులు వినతిపత్రం అందజేశారు.
రైతుల సమస్యలు పరిష్కరించే వరకు మేం పోరాడతాం: భట్టి - clp leader bhatti vikramarka
మధ్య మానేరు బ్యాక్ వాటర్ కరకట్ట లీకేజీతో సిరిసిల్ల పట్టణంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పక్షాన శాసనసభలో చర్చిస్తామని స్పష్టం చేశారు.
![రైతుల సమస్యలు పరిష్కరించే వరకు మేం పోరాడతాం: భట్టి clp leader bhatti vikramarka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9558581-25-9558581-1605519108901.jpg)
సీఎల్పీ నేత భట్టివిక్రమార్క
మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని కర్షకుల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని భట్టి విక్రమార్క అన్నారు. ఇలాంటి పాలనకు చరమగీతం పాడాలని కోరారు. సిరిసిల్ల రైతుల సమస్యను శాసనసభలో చర్చించి న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.