రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో నీళ్ల ట్యాంక్ ఎక్కి ఓ రైతు నిరసన తెలిపాడు. గత కొన్ని నెలల క్రితం పోతుగల్ గ్రామానికి చెందిన చంద్రం అనే రైతు తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిని… అప్పటి ప్రజా ప్రతినిధులు వ్యవసాయ మార్కెట్ కోసం ఆ స్థలం కావాలని కోరారు. చంద్రం తాను అమ్మనని అన్నప్పటికీ, అప్పటి ఎంపీపీ, ప్రజా ప్రతినిధులు… ఆ స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీకి తక్కువ ధరకు అమ్మితే… తన కొడుకుకు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
'కుమారునికి ఉద్యోగం ఇప్పించాలని ట్యాంక్ ఎక్కి నిరసన' - నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన
తన కుమారుడికి ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇప్పించలేదని ఓ రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. స్థానిక పోలీసులు, ప్రజా ప్రతినిధులు అక్కడకు చేరుకుని... ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆ రైతు కిందకు దిగాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
అలా తన కొడుకుకు ఉద్యోగం ఇప్పిస్తామని అనడంతో ఎకరానికి రూ.10 లక్షల ఉన్న భూమిని… రెండు ఎకరాలను రూ.5 లక్షలకే మార్కెట్ కమిటీకి విక్రయించానని తెలిపాడు. ప్రస్తుతం మార్కెట్ కమిటీలో వేరే వారికి ఉద్యోగం ఇవ్వడంతో, తన కొడుకు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాడని వాపోయాడు. తన కుమారునికి ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ పోతుగల్లోని వాటర్ ట్యాంక్ ఎక్కి రైతు చంద్రం నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, ప్రజా ప్రతినిధులు వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. తన కొడుకుకు మంత్రితో మాట్లాడి ఉద్యోగం కల్పించే విధంగా చూస్తామని… హామీ ఇవ్వడంతో రైతు నీళ్ల ట్యాంక్ నుంచి కిందికి దిగి వచ్చాడు.
ఇదీ చూడండి:Fight: పోలీస్ స్టేషన్ ముందే దాడి చేసుకున్న బంధువులు