లేగదూడను చిరుత హతమార్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వీర్నపల్లి మండలం మద్దిమల్లతండాలో ఓ రైతుకు చెందిన లేగదూడపై దాడిచేసి హతమార్చింది. గ్రామానికి చెందిన మాలోత్ రమేశ్ రోజూలాగే పొలం వద్ద పశువులపాకలో రెండు ఎద్దులు, లేగదూడను కట్టేసి ఇంటికి వచ్చాడు.
లేగదూడపై చిరుత పంజా.. పెద్దపులిపై అనుమానం - లేగదూడను చంపేసిన చిరుత
పొలం వద్ద పశువుల పాకలో ఉన్న లేగదూడపై చిరుత పంజా విసిరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల తండాలో దాడి చేసి హతమార్చింది.
పెద్దపులిపై అనుమానం :
ఆదివారం పొలం వద్దకు వెళ్లి చూడగా లేగదూడ చనిపోయి ఉంది. ఈ దాడి పెద్దపులి చేసినట్లుగా రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా మద్దిమల్లతండా ఆటవీ ప్రాంతంలో పెద్దపులి తమ జీవాలను బెదిరింపులకు గురిచేయగా.. తాము కేకలు వేయడంతో పారిపోయిందని బండారీ మహేశ్ యాదవ్ తెలిపారు. నిరుపేద గిరిజన రైతు మాలోత్ రమేశ్‌కు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని అటవీశాఖ అధికారులను కోరారు. పెద్దపులి, చిరుత బారి నుంచి తమ పశువులను కాపాడాలని మద్దిమల్లతండా, వీర్నపల్లి, రంగంపేట గిరిజన తండాల ప్రజలు కోరుతున్నారు.