రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీ సెంటర్లో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎంహెచ్ఓ చంద్రశేఖర్... తన చెప్పులను అటెండర్‌తో తుడిపించారు.
అటెండర్‌తో చెప్పులు తుడిపించుకున్న డీఎంహెచ్ఓ - SRCL_DMHO_CHEPPU THUDICHINA_ATENDAR
ఆయనో జిల్లా వైద్య విభాగానికి బాస్. జిల్లా ఉన్నతాధికారైన డీఎంహెచ్ఓ అటెండర్‌తో చెప్పులు తుడిపించుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లిలో ఏర్పాటు చేసిన పీహెచ్సీ సమావేశంలో భాగంగా ఈ దారుణం చోటు చేసుకుంది.
![అటెండర్‌తో చెప్పులు తుడిపించుకున్న డీఎంహెచ్ఓ 'చెప్పులపై క్యాండిల్ మరకలు... తుడిపించుకున్న డీఎంహెచ్ఓ'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5604000-thumbnail-3x2-shoe.jpg)
'చెప్పులపై క్యాండిల్ మరకలు... తుడిపించుకున్న డీఎంహెచ్ఓ'
జిల్లాలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెప్పులు తుడుస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిపై డీఎంహెచ్ఓను వివరణ కోరగా, చెప్పులపై క్యాండిల్ మరకలు పడితే... చూడమన్నానని బదులిచ్చారు. ఇటీవల యువకులను చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు ఉన్నాతాధికారులు. మరి ఈ విషయంలో సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
ఇవీ చూడండి : పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి ఎర్రబెల్లి అసంతృప్తి