రాజన్న సిరిసిల్ల జిల్లాలో వింత జరిగింది. సిరిసిల్ల మండలం చిన్నబోనాల గ్రామంలో బర్రె కడుపులో పంది జన్మించినట్టు గ్రామస్థులు చెప్పడం వల్ల అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్న బోనాల గ్రామానికి చెందిన గోసుకుల మల్లయ్య ఆదివారం సిరిసిల్ల పశువుల సంతలో రూ.33 వేలకు బర్రెను కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకు వచ్చిన మరుసటి రోజే పంది పంది ఆకారంలో ఉన్న జంతువుకు జన్మనిచ్చింది. ఈ వింతను చూసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు. నెలలు నిండక పోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.
రాజన్న సిరిసిల్లలో వింత.. పందికి జన్మనిచ్చిన బర్రె.. - pig
రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల గ్రామంలో ఓ బర్రె పందికి జన్మనిచ్చిన వింత సంఘటన చోటుచేసుకుంది. దీనిని చూసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు.
పందికి జన్మనిచ్చిన బర్రె..