తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమస్య పరిష్కారమయ్యే వరకు ఎన్నికలు జరగనివ్వం' - gollapalli panchayat in sircilla district

సరిహద్దు సమస్య పరిష్కరించకుండా ఎన్నికలు నిర్వహించకూడదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో నూతనంగా ఏర్పడిన గొల్లపల్లి గ్రామస్థులు కోరారు. సమస్య పరిష్కారమవ్వకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే పోలింగ్​ను బహిష్కరించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

Gollapalli panchayat, border issue, election boycott
గొల్లపల్లి పంచాయతీ, సరిహద్దు సమస్య, ఎన్నికల బహిష్కరణ

By

Published : Mar 30, 2021, 11:29 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో నూతన గ్రామపంచాయతీగా ఏర్పడిన గొల్లపల్లి గ్రామంలో సరిహద్దు సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు. సమస్య పరిష్కరించకుండా ఎన్నికలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే పోలింగ్​ బహిష్కరించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

గతంలో రెండు సార్లు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినా.. తమ సమస్యలు పరిష్కరించలేదని పోలింగ్​ను బహిష్కరించారు. 148 మంది ఓటర్లకు సంబంధించిన ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములను వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీలో అన్యాయంగా కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కరించే వరకు సర్పంచ్​ ఎన్నికలు జరగనివ్వమని తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యే రసమయి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని ఎంపీపీ వెంకటరమణారెడ్డి వారికి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details