బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు - ఆలయానికి పోటెత్తిన భక్తులు
బద్ది పోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. బోనాలు సమర్పించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు కళకళలాడాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రీతి పాత్రమైన నైవేద్యాలను ప్రసాదంగా వండుకొని బోనాలు చెల్లించారు. భక్తుల రద్దీతో అమ్మవారి దర్శనానికి నాలుగు గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉన్నారు.