రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చాక ధాన్యాన్ని దగ్ధం చేసి మరీ తమ నిరసనను వ్యక్తం చేశారు. తాలు పేరిట ప్రతి క్వింటాలుకు ఐదు కిలోల చొప్పున కోత విధిస్తున్నారని... అలాగే తూకం వేయడంలో కూడా జాప్యం చేస్తున్నారని వాపోయారు.
ధాన్యాన్ని దగ్ధం చేసి మరీ నిరసన తెలియజేస్తున్న రైతులు - ధాన్యాన్ని దగ్ధం చేసి మరీ నిరసన తెలియజేస్తున్న రైతులు
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చాక ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ పంటను దగ్ధం చేసి మరీ తమ నిరసనను వ్యక్తం చేశారు అన్నదాతలు.
ధాన్యాన్ని దగ్ధం చేసి మరీ నిరసన తెలియజేస్తున్న రైతులు
ధాన్యాన్ని ఆరబెట్టుకొని తూకం వేసేందుకు ఎదురు చూస్తున్న సమయంలో... వర్షాలు కురిస్తే తమ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవతుందని ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య బోయినపల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తాలు లేని ధాన్యాన్ని జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని మిల్లర్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇవీ చూడండి:కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం'
Last Updated : Apr 26, 2020, 3:21 PM IST