రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి కావలసిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో కలిసి రైల్వే లైన్ భూ సేకరణ పెండింగ్ అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.
దక్షిణ కాశీ మీదుగా..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తపల్లి - మనోహరాబాద్ వరకు వేస్తున్న రైల్వే లైన్ ట్రాక్ 17 గ్రామాల మీదుగా వెళ్తుందని .. ఈ 17 గ్రామాలకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత తొందరగా.. మిగిలిన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసి రైల్వే అధికారులకు భూములను అప్పగించాలని సూచించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పట్టణం మీదుగా ఈ ట్రాక్ వస్తుందని తెలిపిన ఆయన ఈ నిర్మాణం ఏర్పాటైతే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.