నాగులపంచమి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయంలోకి వెళ్లే మెట్లదారిలో పక్కన ఉన్న డ్రైనేజీ వద్ద నల్ల నాగు పాము జనాల దృష్టిలో పడింది.
వేములవాడ భీమన్న ఆలయంలో నల్లనాగుపాము దర్శనం - vemulawada news
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయంలో నాగుపాము దర్శనమిచ్చింది. కప్పను తింటూ కనిపించిన పామును వెంటనే పట్టుకుని నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టారు.
![వేములవాడ భీమన్న ఆలయంలో నల్లనాగుపాము దర్శనం black cobra appeared in vemulawada bheemuni temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8183056-602-8183056-1595778088295.jpg)
వేములవాడ భీమన్న ఆలయంలో నల్లనాగుపాము దర్శనం
కప్పను తింటున్న నాగుపామును చూసిన వెంటనే... పాములు పట్టే వ్యక్తి బాబుకు సమాచారమిచ్చారు. హుటాహుటిన వచ్చిన బాబు నాగుపామును పట్టుకుని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయగా... ఆలయ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.