కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో ప్రజలకందేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సిరిసిల్లలో పొదుపు సంఘం భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశాని హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పార్టీలకతీతంగా అభివృద్ధికి కృషి చేయాలి : బండి సంజయ్
ఎన్నికల తర్వాత రాజకీయాలకతీతంగా అభివృద్ధికి కృషి చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పొదుపు సంఘం భవనంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ(దిశ) సమావేశానికి హాజరయ్యారు.
రాజన్న సిరిసిల్లలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఎన్నికల వరకే రాజకీయాలు తప్ప.. ఎన్నికలు పూర్తయ్యాక పార్టీలకతీతంగా అభివృద్ధికి కృషి చేయాలని బండి సంజయ్ సూచించారు. ఈ సమావేశంలో ప్రధానంగా విద్య, వైద్య, ఆరోగ్యశాఖ, రెవెన్యూ, ఉపాధి హామీ పనులు, ఉపాధి కల్పన, వ్యవసాయంపై చర్చించారు.
- ఇదీ చూడండి :'సమష్టి కృషితోనే సమ్మిళిత అభివృద్ధి'