సన్నరకం ధాన్యానికి 2,500ల మద్ధతు ధర ప్రకటించాలని కోరుతూ భాజపా నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో ధర్నాకు దిగారు. రైతులతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించారు.
సన్నరకానికి మద్దతు ధర కల్పించాలని భాజపా ఆందోళన - రాజన్న సిరిసిల్ల వార్తలు
సన్నరకం ధాన్యానికి మద్ధతు ధర కల్పించాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భాజపా నాయకులు ఎల్లారెడ్డి పేట మండలంలో ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
రైతులతో కలిసి భాజపా నాయకుల ధర్నా.. రోడ్డుపై బైఠాయింపు
అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా నాయకులు సూచించారు. సన్నరకం ధాన్యానికి రూ. 2,500 మద్ధతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసన చేస్తున్న భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.