అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్గిల్ లేక్ వద్ద భాజపా నేతలు సైరన్ మోగించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి సేవలను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
'కార్గిల్ లేక్'లో అమరవీరులకు భాజపా నివాళి - Rajanna Sirisilla District Latest News
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్గిల్ లేక్ వద్ద భాజపా నేతలు సైరన్ మోగించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు.

కార్గిల్ లేక్ వద్ద సైరన్ మోగింస్తున్న భాజపా నేతలు
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సిరిసిల్ల కార్గిల్ లేక్ యుద్ధ నౌక వద్ద అమరవీరులకు భాజపా నాయకులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అన్నల్ దాస్ వేణు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆడెపు రవీందర్, సింగిల్విండో అధ్యక్షురాలు భర్కం లక్ష్మీ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:దిల్లీ ఘటనలో కుట్ర దాగి ఉంది : సురవరం