తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ... భాజపా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ బస్సులకు కిలోమీటర్‌కు 20 పైసలు పెంచుతూ సామాన్య ప్రజలపై భారం మోపడం బాధాకరమన్నారు. వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'ముఖ్యమంత్రి సామాన్య ప్రజలపై భారం మోపాడు' - రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

'ముఖ్యమంత్రి సామాన్య ప్రజలపై భారం మోపాడు'