తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా ఆధ్వర్యంలో పీపీఈ కిట్ల పంపిణీ - సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి పీపీఈ కిట్ల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి సిబ్బంది కోసం భాజపా ఆధ్వర్యంలో పీపీఈ కిట్లు అందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్​ మురళీధర్​ రావుకు 400 పీపీఈ కిట్లు అందజేశారు.

bjp leaders distribute 400 ppe kits
భాజపా ఆధ్వర్యంలో పీపీఈ కిట్ల పంపిణీ

By

Published : Aug 24, 2020, 8:56 PM IST

కరోనా నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రిలోని సిబ్బందికి భాజపా ఆధ్వర్యంలో పీపీఈ కిట్లు అందజేశారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​ సౌజన్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ నాయకులు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది కోసం పీపీఈ కిట్లు పంపిణీ చేశారు.

సిబ్బంది కోసం జిల్లా ఆస్పత్రికి సూపరింటెండెంట్​ మూరళీధర్​రావుకు 400 పీపీఈ కిట్లు అందజేసినట్లు భాజపా నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఠాగూర్ రాజాసింగ్, కౌన్సిలర్ నాగరాజు, జీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణు, ఉపాధ్యక్షుడు మ్యాన రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు.. నిందితులు పరార్

ABOUT THE AUTHOR

...view details