సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యువతకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాక వంతెనను బండి సంజయ్ సందర్శించారు. వంతెనపై నుంచి దూకి యువకులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో బండి సంజయ్... ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వంతెనపై రక్షణ కంచె ఏర్పాటు చేస్తే... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉంటాయని పేర్కొన్నారు.
'సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు... ధైర్యంగా పోరాడాలి' - kodurupaka bridge suicids
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాక వంతెనను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించారు. వంతెనపై నుంచి దూకి యువకులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఘటనాస్థలాన్ని పరిశీలించారు. తొందరపడి అనాలోచితంగా ఆత్మహత్యలు చేసుకుని బంగారు భవిష్యతును యువత కాలరాసుకోవద్దని సూచించారు.
bjp leader bandi sanjay visited kodurupaka bridge
ఇటీవలే వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన యువకుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొందరపడి అనాలోచితంగా ఆత్మహత్యలు చేసుకుని బంగారు భవిష్యతును యువత కాలరాసుకోవద్దని సూచించారు. సమస్యలపై ధైర్యంగా పోరాడి గెలిచి జీవితంలో విజేతగా నిలిచి సత్తా చాటాలని హితవు పలికారు. నాలుగు వరుసల వంతెనను ఇరువైపులా తిరిగి సందర్శించారు.