తెలంగాణ

telangana

ETV Bharat / state

''సర్వేజనా సుఖినోభవంతు'ను నిజం చేస్తూ... ధర్మంగా బతకాలి' - గూడెంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం

సర్వేజనా సుఖినోభవంతు అనే ఆర్యోక్తిని నిజం చేస్తూ... ప్రతి ఒక్కరు ధర్మంగా జీవించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూచించారు. రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్​ మండలం గూడెంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి కల్యాణంలో పాల్గొనటం అత్యంత ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

bjp leader bandi sanjay attended in gudem venkateswara swamy marriage
bjp leader bandi sanjay attended in gudem venkateswara swamy marriage

By

Published : Mar 30, 2021, 6:00 PM IST

శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవానికి బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవానికి భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. మహిళల కోలాటాలతో సంజయ్​కు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన గూడెం వెంటేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించుకోవటం... చాలా ఆనందంగా ఉందని సంజయ్​ హర్షం వ్యక్తం చేశారు.

కల్యాణాన్ని తిలకిస్తున్న బండిసంజయ్​...

ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండి ఎదుటివారి అభివృద్దిని కాంక్షించే వారే హిందూధర్మ పరిరక్షకులని బండి సంజయ్​ సూచించారు. సర్వేజనా సుఖినోభవంతు అనే ఆర్యోక్తిని నిజం చేస్తూ... ప్రతి ఒక్కరు ధర్మంగా జీవించాలని హితవు పలికారు. స్వామివారి కరుణాకటాక్షాలూ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

మహిళాభక్తులతో బండి సంజయ్​

ఇదీ చూడండి: కరోనా సాకుతో వినియోగదారులపై ధరాభారం

ABOUT THE AUTHOR

...view details