తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా నాయకుల ముందస్తు అరెస్టులు - రాజన్న సిరిసిల్ల జిల్లా లేటెస్ట్​ వార్తలు

కేటీఆర్​ పర్యటన దృష్ట్యా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో భాజపా, ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. వారి అరెస్ట్​తో స్థానకంగా కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

bjp activists arrest in rajanna sirirsilla district
భాజపా నాయకుల ముందస్తు అరెస్టులు

By

Published : Dec 9, 2020, 6:14 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన దృష్ట్యా భాజపా, ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేయటంతో ఉద్రిక్తత చోటుచేసుకొంది. మంత్రిని కలిసి రెండు పడక గదుల ఇళ్లపై వినతి ఇవ్వాలని భావించినట్లు భాజపా నాయకులు పేర్కొన్నారు. అయితే మంత్రిని అడ్డుకుంటున్నారని భావించిన తెరాస నాయకులు భాజపా నాయకులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు భాజపా నాయకులను అరెస్ట్ చేసి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్​కు తరలించారు. దీంతో వారు అక్కడే ఆందోళనకు దిగారు. మంత్రిని కలిసి వినతి పత్రం ఇద్దామనుకుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details