రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీలు శుభ్రం చేయడానికి వచ్చిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు.
పట్టణ ప్రగతిలో తేనెటీగల దాడి - కూలీలపై తేనెటీగలు దాడి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. గాయపడిన ఆరుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పట్టణ ప్రగతిలో తేనెటీగల దాడి
వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వారి పేర్లు వరుసగా చిట్యాల వెంకటేశ్, పస్తం అనిల్, అంగిడి కనకవ్వ, మనుపాట నర్సవ్వ, ఆంగిడి పద్మ, లోకిని, సుజాతలు పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'