తెలంగాణ

telangana

By

Published : Dec 27, 2020, 9:39 AM IST

ETV Bharat / state

ఈసారి జకార్డ్‌ అంచు డిజైన్లతో బతుకమ్మ చీరలు

రాష్ట్రంలో పేద మహిళలకు పంపిణీ చేసే బతుకమ్మ చీరల తయారీని ఈసారి జనవరిలోనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పండుగకు నెల రోజుల ముందే పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించింది. ఆ మేరకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది.

bathukamma sarees will making from january
ఈసారి జకార్డ్‌ అంచు డిజైన్లతో బతుకమ్మ చీరలు

పేద మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా అందించే బతుకమ్మ చీరల తయారీని జనవరి నుంచే తయారు చేయాలని సర్కారు నిర్ణయించింది. పండుగకు నెల రోజుల ముందే పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించింది. ఆ మేరకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈసారి కూడా రూ.317 కోట్లతో కోటి చీరలు తయారు కానున్నాయి.

కొత్తగా జకార్డ్‌ (పట్టు) అంచు డిజైన్లతో చీరలను తయారు చేయనున్నారు. ఏటా ఫిబ్రవరిలో బతుకమ్మ చీరల తయారీని ప్రారంభిస్తున్నారు. ఈసారి కరోనా పరిస్థితుల నేపథ్యంలో నెల ముందే ఉత్పత్తిని ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీ రామారావు ఇటీవల అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే బడ్జెట్‌లో నిధుల కేటాయిస్తామని, వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు.

మహిళలు కోరిన మేరకు.. కొత్త డిజైన్లు రూపొందించాలన్నారు. అనంతరం చేనేత కమిషనర్‌ శైలజారామయ్యర్‌ మహిళలు, నిపుణులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. ప్రస్తుతం జకార్డ్‌ అంచుల డిజైన్‌కు ఎక్కువ డిమాండ్‌ ఉందని, వాటితోనే చీరలు తయారుచేయాలని నిర్ణయించారు. కార్యాచరణలో భాగంగా చేనేత అధికారులు సిరిసిల్లలోని మరమగ్గాల సంఘాల ప్రతినిధులతో ఈ నెలలో రెండు దఫాలు సమావేశాలు నిర్వహించారు. జనవరి మొదటి వారంలో చీరల తయారీని ప్రారంభించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబరు 6న వచ్చింది. దీంతో ఆగస్టు నెలాఖరుకు మొత్తం కోటి చీరలను తయారు చేయాలని స్పష్టం చేశారు. ఈసారి 26 వేల మరమగ్గాలపై 16 వేలకు పైగా నేతన్నల కుటుంబాలకు ఉపాధి కలగనుంది.

ఇదీ చదవండి:మందు లేకుండా చేద్దాం విందు... ఆనందంతో వేద్దాం చిందు...

ABOUT THE AUTHOR

...view details