Bathukamma Sarees: తెలంగాణలో 2022లో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయనుంది. దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రణాళికను ఖరారు చేసింది. ఈ ఏడాది బతుకమ్మ చీరలను 200 డిజైన్లలో, 10 రంగుల్లో తయారు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు చీరలు ఉత్పత్తి చేయాలంటూ మరమగ్గాల యజమానులకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. వచ్చే ఆగస్టు నాటికి ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిర్దేశించింది. గతంలో ఉన్న జరీ (బంగారు వర్ణం నూలు) స్థానంలో ఈ సారి రంగుల నూలుతో డిజైన్లను రూపొందించారు. సిరిసిల్ల పరిశ్రమలోని 271 మ్యాక్స్, ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల యజమానులు బుధవారం నుంచి వస్త్రోత్పత్తి ఆర్డర్లు తీసుకుంటున్నారు. అధికారులు ఈ ఏడాది సిరిసిల్లకు 4.48 కోట్ల మీటర్లు, కరీంనగర్‌లోని గర్షకుర్తికి 14 లక్షలు, హనుమకొండకు 6.31 లక్షలు, వరంగల్‌కు 93 వేలు, మండేపల్లి టెక్స్‌టైల్ పార్కుకు 24 లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తికి ఆర్డర్లు కేటాయించారు. రాష్ట్రంలో ఈ ఏడాది బతుకమ్మ చీరల కోసం 5 కోట్ల మీటర్ల వస్త్రం అవసరమని అంచనా వేశారు. మరో వారం, పది రోజుల్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. బతుకమ్మ చీరల ఉత్పత్తితో ఈ ఆరు నెలల కాలంలో ఒక్కో కార్మికుడికి రోజుకు సగటున రూ.900 వరకు వేతనం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాల కంటే ముందే చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
200 డిజైన్లు, 10 రంగులు.. ఈ ఏడాది కోటి బతుకమ్మ చీరలు
Bathukamma Sarees: బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ చీరలు ఈ ఏడాది మరింత ఆకర్షణీయ డిజైన్లతో రాబోతున్నాయి. దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రణాళికను ఖరారు చేసింది. ఈ ఏడాది బతుకమ్మ చీరలను 200 డిజైన్లలో, 10 రంగుల్లో తయారు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు చీరలు ఉత్పత్తి చేయాలంటూ మరమగ్గాల యజమానులకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది.
200 డిజైన్లు, 10 రంగులు.. ఈ ఏడాది కోటి బతుకమ్మ చీరలు