నీళ్లు- నిధులు- నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని కరీంనగర్ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లెలో ఆత్మహత్య చేసుకున్న ఓయూ విద్యార్థి నాయకుడు ముచ్చర్ల మహేందర్ యాదవ్ కుటుంబాన్ని బండి పరామర్శించారు. యువతకు ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సైతం నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి అయినా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు నిరుద్యోగ భృతి అందజేయాలి: బండి - bandi sanjay news
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా చలించడం లేదని మండిపడ్డారు.
బండి సంజయ్ పరామర్శ
ప్రభుత్వం ఇప్పటికైనా చలించి ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు నిరుద్యోగులకు భృతి అందజేయాలని బండి డిమాండ్ చేశారు. అనంతరం అదే గ్రామంలో ప్రమాదవశాత్తు గాయపడిన యువకుడు లక్ష్మణ్‌ను పరామర్శించారు. అతని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.