రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం భాజపాలో చేరారు. ఆయనతో పాటు అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు కటకం మృత్యుంజయం లాంటి అనుభవం ఉన్న వ్యక్తి అవసరం పార్టీకి ఎంతైనా ఉందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్ తొత్తులుగా మారి ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సగం జీతం ఇవ్వకపోయినా... సీఎంను ఇప్పటికీ ప్రశ్నించడం లేదని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ క్వారంటైన్ ముఖ్యమంత్రి: బండి సంజయ్ - సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు
రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ క్వారంటైన్ ముఖ్యమంత్రి అని.. గత ఆరేళ్లుగా బయటకు రావడం లేదని ఆరోపించారు. అంతకుముందు గంభీరావుపేట మండల కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, తన అనుచరులతో కలిసి భాజపాలో చేరారు.
'ఉద్యోగ సంఘాల నాయకులు.. కేసీఆర్ తొత్తులు'
కేసీఆర్పై బండి ఆరోపణలు
- ముఖ్యమంత్రి క్వారంటైన్ ముఖ్యమంత్రి అని.. గత ఆరేళ్లుగా బయటకు రావడం లేదనన్నారు.
- గాంధీ ఆస్పత్రి సహా, అనేక ఆస్పత్రుల్లో పీపీఈ కిట్లు లేక డాక్టర్లు కరోనా బారిన పడుతున్నారని, టెస్టులు సరిగా చేయకపోవడం వల్లనే కేసులు ఎక్కువ అవుతున్నాయని సంజయ్ ఆరోపించారు.
- ఏ భూమిలో ఏ పంట పండుతుందన్నది.. రైతులకు మాత్రమే తెలుసని సీఎం మాత్రం ఫామ్ హౌస్లో ఉండి తాను చెప్పిన పంట వేయాలని శాసిస్తునారని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- భాజపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, 100% కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
- మద్యం దుకాణాల కోసం జీవోలు తెచ్చారని విమర్శించారు.
ఇదీ చూడండి:పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?