తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రగ్స్‌ కేసులో కేటీఆర్‌ దోస్తులే ఉన్నారు.. త్వరలోనే ఆయన కూడా: బండి సంజయ్​ - Bandi Sanjay fires on KTR latest news

Bandi Sanjay Comments On KTR: మంత్రి కేటీఆర్​పై బండి సంజయ్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కవిత మద్యం కుంభకోణం కేసులో దొరికిపోయారని.. అదేవిధంగా కేటీఆర్ కూడా మరో స్కామ్‌లో దొరికిపోతున్నారని విమర్శించారు. డ్రగ్స్‌ కేసులో మంత్రి కేటీఆర్‌ దోస్తులే ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : Dec 22, 2022, 7:50 PM IST

Bandi Sanjay Comments On KTR: తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దొరికిపోయారని అన్నారు. కేటీఆర్ కూడా మరో స్కామ్‌లో దొరికిపోతారని ఆరోపించారు. కేటీఆర్‌ డ్రగ్‌ టెస్టుకు ఇప్పుడు వెంట్రుకలు తీసుకోమంటున్నారని.. విదేశాల్లో ట్రీట్‌మెంట్‌ తీసుకొని వచ్చి ఇప్పుడు టెస్టుకు సిద్ధమంటున్నారని మండిపడ్డారు. వేములవాడలో నిర్వహించిన సెస్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

డ్రగ్స్‌ కేసుల్లో మంత్రి కేటీఆర్‌ దోస్తులే ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్, బెంగళూరులో డ్రగ్స్‌ కేసులను దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యల గురించి ప్రశ్నిస్తే చెప్పుతో కొడతా అని ట్విటర్ టిల్లు అంటున్నారని విమర్శించారు. రేపు వీరిని గెలిపిస్తే నిజంగానే పేదలను కొడతారని దుయ్యబట్టారు. వేములవాడలోని డబ్బులు తీసుకుపోయి వేరే జిల్లాలో పెడుతున్నారని ఆక్షేపించారు. తాను సిరిసిల్ల వచ్చానని మంత్రులను ఇంఛార్జ్​లుగా నియమించారని.. ఇది బీజేపీ గొప్పతనం అని అన్నారు. బీఆర్​ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి , బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని ఆరోపించారు. రాష్ట్రంలోనే గతి లేదు కానీ.. దేశంలో ఏం పని చేస్తారని బండి సంజయ్ నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details