తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ సర్పంచి గారూ.. కొత్త సర్పంచిని ఎన్నుకోనివ్వండి - హైకోర్టులో పిటిషన్‌ వెనక్కి తీసుకోవాలని ధర్నా

పంచాయతీ ఎన్నికలు జరగకుండా మాజీ సర్పంచి అడ్డుపడుతున్నాడని రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లిలో ఎస్సీ సంఘాలు నిరసన తెలిపాయి. ఎస్సీకి కేటాయించిన సర్పంచి పదవిని బీసీకి మార్చేలా హైకోర్టులో పిటిషన్ వేసి స్టే తీసుకొచ్చారని ఆరోపించారు.

baddenapalli shcedule caste people protest at former sarpunch house
మాజీ సర్పంచి గారూ.. కొత్త సర్పంచిని ఎన్నుకోనివ్వండి

By

Published : Mar 4, 2020, 8:26 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఎస్సీ సంఘాలు నిరసన తెలిపాయి. పంచాయతీ ఎన్నికలు జరగకుండా మాజీ సర్పంచి హైకోర్టులో స్టే తెస్తున్నారని ఆరోపించారు. సర్పంచి పదవిని ఎన్నికల సంఘం ఎస్సీకి రిజర్వ్ చేసినప్పటికీ కొంతమంది పేర్లు తొలిగించి బీసీకి కేటాయించేలా ప్రయత్నిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో సర్పంచి లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గ్రామాభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామంలో దండోరా వేస్తూ ర్యాలీ తీశారు. ఇప్పటికైనా కోర్టులో వేసిన పిటిషన్లు విరమించుకొని ఎన్నికలకు సహకరించాలని కోరారు.

మాజీ సర్పంచి గారూ.. కొత్త సర్పంచిని ఎన్నుకోనివ్వండి

ఇదీ చూడండి:పండుగలను న్యాయస్థానాలు నిషేధించలేవు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details