ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత తొమ్మిది రోజులుగా ఆలయంలో కొనసాగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు పూర్ణాహుతి నిర్వహించి ఆయుధ పూజ చేశారు.
రాజన్న ఆలయంలో ఘనంగా ఆయుధ పూజలు - latest news of rajanna temple in ayudha puja
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలో అర్చకులు వైభవంగా ఆయుధ పూజలు నిర్వహించారు.
![రాజన్న ఆలయంలో ఘనంగా ఆయుధ పూజలు ayudha puja in rajanna temple in vemulawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9306077-628-9306077-1603627508479.jpg)
రాజన్న ఆలయంలో ఘనంగా ఆయుధ పూజలు
స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా పూలతో ముస్తాబు చేశారు.