రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగభృతి ఇవ్వాలంటూ.... ఏబీవీపీ నాయకులు కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు యత్నించారు. ఇదే సమయంలో 30 పడకల ఆస్పత్రి హామీ నెరవేర్చాలంటూ.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకునే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కేటీఆర్ పర్యటనను అడ్డుకునేందుకు యత్నం
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కాంగ్రెస్, ఏబీవీపీ నాయకులు అడ్డుకున్నారు. మంత్రికి వ్యతిరేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో నిరసన వ్యక్తం చేశారు.
కేటీఆర్ పర్యటన
ఏబీవీపీ- తెరాస నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోగా... ఘర్షణలు అడ్డుకునేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుపై భాజపా నాయకులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.
ఇదీ చూడండి:సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
Last Updated : Apr 19, 2021, 5:20 PM IST