రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి సమీపంలో అదుపు తప్పి ట్రాలీ ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. మామిడిపల్లి గ్రామానికి చెందిన పత్రి గంగారాం, కోళ్ల రాములుతో పాటు మరో ముగ్గురు బాబుసాయిపేట గ్రామానికి ట్రాలీ ఆటోలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న రాములుతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా రాజారాం, గంగరాజు, గంగారాంలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
అదుపు తప్పి ట్రాలీ ఆటో బోల్తా.. ఇద్దరు మృతి - accident
రాజన్న సిరిసిల్ల జిల్లా మామిడిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
అదుపు తప్పి ట్రాలీ ఆటో బోల్తా.. ఇద్దరు మృతి