తెలంగాణ

telangana

ETV Bharat / state

సిరిసిల్లలో ఆరుగురు జనశక్తి నక్సల్స్ అరెస్ట్ : ఎస్పీ హెగ్డే - janashakthi latest News

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరుగురు జనశక్తి నక్సల్స్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు తుపాకులు, 6 లెటర్ ప్యాడ్స్ స్వాధీనం చేసుకున్నారు.

సిరిసిల్లలో ఆరుగురు జనశక్తి నక్సల్స్ అరెస్ట్ : ఎస్పీ హెగ్డే
సిరిసిల్లలో ఆరుగురు జనశక్తి నక్సల్స్ అరెస్ట్ : ఎస్పీ హెగ్డే

By

Published : Jul 6, 2020, 8:44 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరుగురు జనశక్తి నక్సల్స్​ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రెండు తుపాకులు, 6 లెటర్ ప్యాడ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సీపీఐ ఎంఎల్ జనశక్తి నక్సల్స్ సుధాకర్ నిజామాబాద్, విట్టల్ సిద్దిపేట జిల్లా జక్కాపూర్, గోవర్ధన్ లింగయ్య అంజయ్య దేవరాజులను అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వీరందరూ రామచంద్రం వర్గంగా ఏర్పడి జనశక్తి పేరిట చందాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ వివరించారు.

వారి సమాచారం ఉంటే ఇవ్వండి..

విశ్వసనీయ సమాచారం మేరకు తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో నక్సల్స్ సమావేశమైనట్లు తెలుసుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఈ ఆరుగురు ప్రయత్నిస్తున్నట్లు హెగ్డే స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా నక్సల్స్ కదలికలు ఉన్నట్లు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

సిరిసిల్లలో ఆరుగురు జనశక్తి నక్సల్స్ అరెస్ట్ : ఎస్పీ హెగ్డే

ఇవీ చూడండి : పేదల విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details