రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం కొదురుపాకలో మధ్యమానేరు ముంపు నిర్వాసితులు బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఅఖిలపక్షం నేతలు చాడ వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎల్ రమణ, వివేక్, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో కొదురుపాక మా అత్తగారి ఊరు... కరీంనగర్ అభివృద్ధి కోసం నేను తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్... ముంపు నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం బాధాకరమని ఎల్ రమణ మండిపడ్డారు. తమ్ముడి పుట్టినరోజుకి అడవిని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి భార్య శోభారాణి... పుట్టిన ఊరు బాగోగులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ముంపు నిర్వాసితులకు పరిహారం అందేవరకు తామంతా కలిసి ఒక్కతాటిపై నిలుస్తామని చాడ వెంకట్ రెడ్డి వివరించారు.
'పరిహారం చెల్లించేవరకు అండగా ఉంటాం' - వివేక్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంపునకు గురైన 13 గ్రామాల ప్రజలకు పరిహారం అందించేవరకు తామంతా అండగా ఉంటామని అఖిలపక్షం నేతలు భరోసా ఇచ్చారు.
'పరిహారం చెల్లించేవరకు అండగా ఉంటాం'