ఈ నెల 8వ తేదీ నుంచి ఆలయాలు తెరుకోనున్నందున... వేములవాడ రాజన్న ఆలయంలో అధికారులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు భౌతికదూరం పాటించేలా క్యూలైన్లలో డబ్బాల రూపంలో గుర్తులు వేశారు. క్యూలైన్లలో ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించేందుకు సిబ్బందికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు.
భద్రత నడుమ రాజన్న దర్శనానికి సర్వం సిద్ధం - వేములవాడ రాజన్న ఆలయం భద్రత నడుమ లాక్డౌన్ తర్వాత తెరుచుకోనుంది
ఈ నెల8 నుంచి ఆలయాలు తెరుచుకోవచ్చునన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. దీనితో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందర్శనార్థం అన్ని భద్రతా చర్యలను చేపడుతున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
భద్రత నడుమ రాజన్న దర్శనానికి సర్వం సిద్ధం
ఆలయ పరిసరాల్లో శానిటైజేషన్ చేసుకునేందుకు, చేతులు శుభ్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులను ఎప్పటికప్పుడు థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలతో పరీక్షలు చేసి, శానిటైజేషన్ చేసిన తర్వాతే ఆలయంలోకి అనుమతించనున్నట్లు ఆలయ ఏఈ ఉమారాణి వెల్లడించారు.
ఇవీ చూడండి:కరోనా సమయంలో పదోతరగతి పరీక్షలా..!