తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న ఆలయంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం

రాజన్న ఆలయంలో శ్రీత్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు 5 రోజుల పాటు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన శాస్త్రీయ సంగీత, హరి కథ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

రాజన్న ఆలయంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం
రాజన్న ఆలయంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం

By

Published : Feb 2, 2021, 12:22 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో 5 రోజుల పాటు నిర్వహించే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. త్యాగరాజ స్వామి ఉత్సవాలకు వివిధ ప్రాంతాలకు చెందిన శాస్త్రీయ సంగీత, హరి కథ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

నాదబ్రహ్మకు నీరాజనాలు, త్యాగరాజ స్వామిని స్మరిస్తూ.. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో ఏటా ఆరాధనోత్సవాలు నిర్వహించడం ఆరున్నర దశాబ్ధాలుగా ఆనవాయితీగా వస్తుంది.

కొవిడ్​ నేపథ్యంలో ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. 1952లో తొలిసారి స్థానిక వయోలిన్ విధ్వాంసుడు విశ్వనాథం, చెవిటి సాంబయ్య వేములవాడలో త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలను ప్రారంభించారు.

ఈసారి కొవిడ్​ 19 నేపథ్యంలో కార్యక్రమాలను తగ్గించారు. గతంలో సంగీత, నృత్య, నాటక విభాగాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈసారి శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, హరికథాగానం మాత్రమే ఏర్పాటు చేశారు. తొలిరోజు మూడు కార్యక్రమాలు, మిగతా నాలుగు నాలుగు రోజుల పాటు రోజుకు రెండు కార్యక్రమాల చొప్పున 11 కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆరాధనోత్సవాల్లో నేటి కార్యక్రమాలు

  • మధ్యాహ్నం... డి.మోహనకృష్ణ, అనుపమ, మంజుల పంచరత్నగానం
  • సాయంత్రం 5.30 నిమిషాలకు... నాగూర్​ బాబు వేణువు, శాస్త్రీయ కచేరి..
  • రాత్రి 7 గంటలకు... జయంతి సావిత్రి త్యాగరాజ చరిత్ర హరికథ

ఇదీ చూడండి:పసిడి వెలుగుల్లో యాదాద్రి.. పరవశంలో భక్తులు

ABOUT THE AUTHOR

...view details