రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ముందు ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తన వ్యవసాయ భూమిలో బోరు వేస్తుండగా సర్పంచ్ అడ్డుకొని ఇబ్బందులు పెడుతున్నాడని.. ఇల్లంతకుంట మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన గుండా లావణ్య ఆందోళన చేసింది.
కలెక్టరేట్ ముందు ఓ మహిళ ఆత్మహత్య యత్నం - rajanna sircilla collectorate
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ముందు ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. తన వ్యవసాయ క్షేత్రంలో బోరు వేస్తుండగా సర్పంచ్ అడ్డుకొని ఇబ్బందులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
కలెక్టరేట్ ముందు ఓ మహిళ ఆత్మహత్య యత్నం
సర్పంచ్‌పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ... పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు డబ్బాను లాగేశారు. బాధితురాలిని అదనపు కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. బాధితురాలితో మాట్లాడిన అడిషనల్ కలెక్టర్ అంజయ్య విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:రూ.60 లక్షల వాచ్ ధ్వంసం.. కస్టమ్స్ అధికారులపై కేసు