తెలంగాణ

telangana

ETV Bharat / state

'హమాలీలకు ప్రత్యేక వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి' - రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు హమాలీ కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని హమాలీ కార్మికులకు ప్రత్యేక వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని, అర్హులైన వారికి ఇళ్లు ఇప్పించాలని, ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

హమాలీలకు ప్రత్యేక వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి

By

Published : Oct 30, 2019, 3:27 PM IST

రాష్ట్రంలో హమాలీ కార్మికులకు ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

ఐకేపీ సొసైటీలో పనిచేస్తున్న హమాలీలకు క్వింటాలుకు రూ. 50 చొప్పున కూలీ నిర్ణయించాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.

హమాలీలకు ప్రత్యేక వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి

ఇదీ చూడండి : మొక్కలు నాటిన ఎంపీ బండప్రకాశ్​.. మరో నలుగురికి గ్రీన్​ ఛాలెంజ్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details