తెలంగాణ

telangana

ETV Bharat / state

కనిపెంచిన పిల్లలు కనికరించలేదు.. చివరకు తల్లితో సహా వీధిపాలు! - తెలంగాణ వార్తలు

బతికిచెడ్డ ఆర్థిక స్థితి... ఇప్పుడు నిలువ నీడలేని దుస్థితి. కనిపెంచిన బంధం కదా కనికరిస్తారేమోనని మంచంలో ఉన్న కన్నతల్లిని తీసుకొని వెళితే అక్కడా నిరాశే. చివరికిలా వీధిపాలయ్యారు.

father protest at daughter house, father seeking daughter help
తల్లికోసం కూతురి ఇంటిముందు ఆందోళన, తండ్రిని కనికరించని కూతురు

By

Published : May 10, 2021, 8:34 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన తంబి వెంకటస్వామి ఒకప్పుడు బాగానే బతికి.. తర్వాత ఆర్థికంగా చితికిపోయారు. తనకున్న ఆస్తిని ఇద్దరు కుమార్తెలకు పంచి భార్య ప్రేమల, తల్లి తులసమ్మ(103)తో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. మంచంలో ఉన్న తల్లి ఎప్పుడు తుది శ్వాస విడుస్తుందో తెలియని పరిస్థితిలో ఉండగా.. దీనిని సాకుగా చూపి అద్దె ఇంటి వారు ఖాళీ చేయించారు.

వెంకటస్వామి.. భార్యను, మంచంలో ఉన్న తల్లిని తీసుకొని వేములవాడలోనే ఉంటున్న పెద్ద కుమార్తె ఇంటికి ఆదివారం వెళ్లారు. వారిని రావద్దంటూ కుమార్తె కుటుంబం వారు గేటుకు తాళం వేయడంతో వెంకటస్వామి దంపతులు అక్కడే టెంట్‌ వేసుకొని బైఠాయించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, కౌన్సిలర్‌ శ్రీనివాసరావు, పోలీసులు కలిసి ఆ కుటుంబాన్ని రాజన్న ఆలయ వసతి గదికి తరలించారు.

మంచంలో తులసమ్మ

ఇదీ చదవండి:కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా

ABOUT THE AUTHOR

...view details