40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పాఠశాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులంతా ఒకే చోట చేరి ఆనందోత్సవాల మధ్య సాధక బాధకాలను చర్చిస్తూ సంతోషంగా గడిపారు. తమకు చదువు చెప్పిన గురువులను సన్మానించారు.
40 ఏళ్ల తర్వాత చదువులమ్మ గూటికి..! - old students get to gather in tamgallapally
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1978-79 పదోతరగతి చదివిన వారు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తమకు చదువులు చెప్పిన గురువులను సన్మానించారు.
40 ఏళ్ల తర్వాత చదువులమ్మ గూటికి
కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, సెస్ ఛైర్మన్ లక్ష్మారెడ్డి, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు.
ఇవీ చూడండి:పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. ఐదేళ్ల పాప మృతి