తెలంగాణ

telangana

ETV Bharat / state

పిడుగుపాటుకు రైతు మృతి - పిడుగు

రైతు బతుకు చావుతో చెలగాటంలా మారింది. పండించిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించిన అన్నదాతను మృత్యువు కబళించింది. పిడుగుపాటుతో ఆ కర్షకుడిని బలి తీసుకుంది. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో జరిగింది.

a farmer dead with Thunderbolt in rajanna sirisilla district
పిడుగుపాటుకు రైతు మృతి

By

Published : Apr 19, 2020, 2:08 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తికి చెందిన పళ్ల శ్రీనివాస్​ వరి ధాన్యం విక్రయించేందుకు ఐకేపీ సెంటర్​కు తీసుకెళ్లారు. వడ్లను ఆరబట్టాలని ఐకేపీ వారు చెప్పటంతో అక్కడే ఎండబోశారు. నిన్న సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం రావటంతో వెంటనే అక్కడికి భార్యతోపాటు చెరుకున్న శ్రీనివాస్​ ధాన్యంపై టార్పలిన్​ కప్పుతున్న క్రమంలో పిడుగు పడింది. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా భార్య స్పృహ కోల్పోయింది.

ABOUT THE AUTHOR

...view details