తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా సోకిన గర్భిణికి పురుడు పోసిన 108 సిబ్బంది - రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కరోనా సోకిన ఓ గర్భిణికి నొప్పులు రాగా.. 108 అంబులెన్స్​ సిబ్బంది ఆమెకు పురుడు పోశారు. అనంతరం తల్లి, బిడ్డను వేములవాడ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

108 staff helped corona infected pregnant woman
కరోనా సోకిన గర్భిణికి పురుడు పోసిన 108 సిబ్బంది

By

Published : Oct 3, 2020, 9:00 AM IST

కరోనా సోకిన ఓ గర్భిణికి 108 అంబులెన్స్​ సిబ్బంది పురుడు పోసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శుక్రవారం జరిగింది. పట్టణంలో న్యూ అర్బన్​ కాలనీకి చెందిన అనూష.. నిండు గర్భిణీగా ఉన్నప్పుడు కరోనా వైరస్​ సోకింది. శుక్రవారం ఆమెకు నొప్పులు రాగా బంధువులు వైద్యులను సంప్రదిస్తే.. హైదరాబాద్​ తరలించమన్నారు. ఈ మేరకు 108 అంబులెన్స్​కు​ సమాచారం అందించగా సిబ్బంది చేరుకుని ఆమెకు వాహనంలో పురుడు పోయగా మగబిడ్డకు జన్మనిచ్చింది.

అంబులెన్స్​లో టెక్నీషియన్​ స్వాతి ఆమెకు ప్రాథమికంగా చికిత్స అందించి.. అనంతరం వేములవాడ ఆరోగ్య కేంద్రానికి తరలించగా తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తొలిసారి అయినా.. కాన్పును సక్రమంగా నిర్వహించిన 108 టెక్నీషియన్​ స్వాతి, పైలెట్​ బాలకృష్ణను స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండిఃవసతుల లేమే శాపం.. మిగిల్చింది గర్భశోకం

ABOUT THE AUTHOR

...view details