తెలంగాణ

telangana

ETV Bharat / state

'కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండడం నా బాధ్యత' - తెలంగాణ వార్తలు

కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని కరోనా బాధితులకు జడ్పీటీసీ కందుల సంధ్యారాణి అండగా నిలుస్తున్నారు. బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి నిత్యావసర సరుకులు, బట్టలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉండడం తన బాధ్యత అని ఆమె అన్నారు.

జడ్పీటీసీ కందుల సంధ్యారాణి మానవత్వం, కరోనా బాధితులకు జడ్పీటీసీ సాయం

By

Published : May 25, 2021, 3:15 PM IST

కరోనా సెకండ్ వేవ్​లో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో బాధితులకు నేనున్నానంటున్నారు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి. కరోనా బారిన పడిన వారి ఇంటివద్దకే వెళ్లి నిత్యావసర సరుకులు, బట్టలు అందిస్తూ ధైర్యం చెబుతున్నారు. రామగుండం నియోజకవర్గంలోని పలు గ్రామాలతోపాటు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో పంపిణీ చేస్తున్నారు. అత్యవసరమైతే ఆస్పత్రులకు తరలించేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు.

గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో కరోనా పరీక్షల కోసం వచ్చిన సుమారు వందమందికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను అందించారు. ఈ విపత్కర కాలంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని జడ్పీటీసీ సంధ్యారాణి సూచించారు. లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు. మండలంలోని బాధితులకు నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం అందించడం తన బాధ్యత అని అన్నారు.

ఇదీ చదవండి:సరిహద్దులో తనిఖీలు.. ఈపాస్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి

ABOUT THE AUTHOR

...view details