నాయకులు ప్రజల కోసం పనిచేస్తుంటే పదవులు అవే వస్తాయని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అన్నారు. తెరాస పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ రావులపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ టీబీజీకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంథని నియోజకవర్గంలో చీకటి పాలనను అంతమొందించడానికి ఎమ్మెల్సీ కవిత చేసిన కృషి మరువలేమని పుట్ట మధు అన్నారు. ఆమె ముఖ్యమంత్రి కూతురిగా కాకుండా ప్రజల పక్షాన ఉండి, ప్రజల కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజా సమస్యలపై స్పందించే విధానాన్ని చూసి టీబీజీకేఎస్ నేతలు కవితను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారని తెలిపారు.