తెలంగాణ

telangana

ETV Bharat / state

షర్మిల పాదయాత్రను అడ్డుకున్న తెరాస శ్రేణులు.. గోబ్యాక్​ అంటూ నినాదాలు - Bitter experience in Sharmila Padayatra

Sharmila Goback slogans in padayatra: పెద్దపల్లి జిల్లా చామనపల్లిలో వైఎస్​ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చామనపల్లి నుంచి కటికనపల్లికి షర్మిల పాదయాత్ర చేస్తోన్న క్రమంలో తెరాస శ్రేణులు అడ్డుకొని షర్మిల గోబ్యాక్​ అంటూ నినాదాలు చేశారు.

పాదయాత్రలో షర్మిల గోబ్యాక్​ అంటూ నినాదాలు.. అసలేమైంది
పాదయాత్రలో షర్మిల గోబ్యాక్​ అంటూ నినాదాలు.. అసలేమైంది

By

Published : Nov 13, 2022, 9:55 PM IST

Go Back Slogans in Sharmila Padayatra: పెద్దపల్లి జిల్లా చామనపల్లిలో వైఎస్ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చామనపల్లి నుంచి కటికనపల్లికలో పాదయాత్ర చేస్తోన్న క్రమంలో చామనపల్లికి చేరుకోగానే.. తెరాస శ్రేణులు ఆమెను అడ్డుకున్నారు. షర్మిల గోబ్యాక్ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. షర్మిల గోబ్యాక్ అంటూ రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు తెరాస శ్రేణులను అడ్డుకొని వారిని చెదరగొట్టారు.

మరోవైపు కటికనపల్లిలో నైట్ క్యాంప్ ఏర్పాటు చేయగా.. తెరాస శ్రేణులు దానిని సైతం అడ్డుకొని తొలగించాలని డిమాండ్ చేశారు. దీనితో అధికార సిబ్బంది నైట్ క్యాంపుకు సంబంధించిన టెంట్లను తొలగించారు. అయినప్పటికీ షర్మిల కటికనపల్లిలోనే రాత్రి బస చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details