తెలంగాణ

telangana

ETV Bharat / state

వైఎస్సార్​ అభిమానుల పాదయాత్ర - వైఎస్ షర్మిల

తెలంగాణలో వైఎస్ షర్మిల అడుగుపెట్టిన మరుక్షణం నుంచి, రాష్ట్రంలోని ఇతర పార్టీలు... మనుగడ కష్టమని భయపడుతున్నాయని వైఎస్సార్​ అభిమానులు పేర్కొన్నారు. ఖమ్మంలో షర్మిల నిర్వహించబోయే.. సంకల్ప సభ విజయవంతం కావాలని కోరుతూ.. పెద్దపెల్లి జిల్లా మంథని నుంచి వేములవాడ వరకు పాదయాత్రను ప్రారంభించారు.

ys rajashekhar reddy
వైఎస్ షర్మిల

By

Published : Apr 6, 2021, 1:48 PM IST

రాష్ట్రంలో మళ్లీ రాజన్న పాలన రావాలని కోరుతూ.. పెద్దపెల్లి జిల్లా మంథనిలోని వైఎస్సార్​ అభిమానులు వేములవాడ వరకు సుమారు 101 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. ఖమ్మంలో వైఎస్ షర్మిల నిర్వహించబోయే.. సంకల్ప సభ విజయవంతం కావాలని కోరుతూ స్థానిక గౌతమేశ్వరస్వామి దేవాలయం నుంచి వేములవాడ సన్నిధానం వరకు కాలినడకన వెళ్తున్నారు.

వైఎస్ షర్మిల.. తెలంగాణలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి, రాష్ట్రంలోని ఇతర పార్టీలు... మనుగడ కష్టమని భయపడుతున్నాయని అభిమానులు పేర్కొన్నారు. వైఎస్సార్​ను ఇష్టపడేవారు.. తండోపతండాలుగా షర్మిల పార్టీలో చేరుతున్నారని తెలిపారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చే సంకేతాలున్నాయని వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్​తో.. మంథని టేలాండ్ ప్రాంతానికి ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:కేసీఆర్​పై అభిమానం చాటుకున్న తెరాస సోషల్‌ మీడియా

ABOUT THE AUTHOR

...view details