పెద్దపల్లి జిల్లా మంథనిలో సౌభాగ్యం కోసం మహిళలు భక్తి శ్రద్ధలతో వటసావిత్రి వ్రతం ఆచరించారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కలకాలం సిరి సంపదలు, పాడి పంటలు వృద్ధి చెందుతాయని మహిళలు భావిస్తున్నారు. ఏటా జ్యేష్ఠ మాసంలో వివాహితులైన స్త్రీలు ఈ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోందని... పురోహితులు తెలిపారు.
పురాణాల ప్రకారం...
పూర్వం సతీ సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతున్ని మృత్యువు నుంచి కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆ సమయంలో నారద మహర్షి ఉపదేశానుసారం వ్రతం ఆచరించి... భర్తను మృత్యువు నుంచి రక్షించుకుంటుంది. ఆ వ్రతమే వటసావిత్రి వ్రతమని పురాణాల్లో భక్తుల నమ్మకం. ఆ రోజునే... తెలుగింటి ఆడపడుచు ఏటా... తన భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారని పురోహితులు తెలిపారు.