కుటుంబ సంక్షేమంలో గణనీయ పాత్ర పోషిస్తున్న మహిళలు.. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడమే కాకుండా.. వారి కుటుంబ సభ్యులకు శిరస్త్రాణం ప్రాముఖ్యతను వివరించాలని రామగుండం సీఐ రమేశ్ కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్నారు.
'మహిళలతోనే ప్రమాద రహిత సమాజ స్థాపన సాధ్యం' - peddapalli district news
వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రామగుండం ట్రాఫిక్ సీఐ రమేశ్ అన్నారు. ప్రమాద రహిత సమాజం కోసం మహిళలు పాటుపడాలని కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్నారు.
ప్రమాద రహిత సమాజ స్థాపనలో మహిళ పాత్ర కీలకం
రహదారి భద్రతా ఉత్సవాల్లో భాగంగా రామగుండం మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రమాద రహిత సమాజం కోసం మహిళలు కూడా పాటుపడాలని రామగుండం ట్రాఫిక్ సీఐ రమేశ్ కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాలల విద్యార్థులు, మహిళలు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి :ఓటీపీతో రేషన్.. సామాన్యులకు తప్పని పరేషాన్...